మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది : సీఎం జగన్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను 2019 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను 2019 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా యువ ఐఏఎస్ అధికారులను సీఎం అభినందించారు. నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందిండం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్న సీఎం ఆకాంక్షిచారు.
ప్రభుత్వ పథకాల అమల్లోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అని, చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం సూచించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఓ మహిళేనని, మహిళల రక్షణ కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని చేయడంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటును యవ అధికారులకు వివరించారు. వాలంటీర్ల వ్యవస్ధ, మహిళాసాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాల పై ముఖ్యమంత్రితో చర్చించినట్లు యువ ఐఏఎస్‌లు తెలిపారు.
ముస్సోరిలోని తమ శిక్షణ లో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధతో పాటు అధికార వికేంద్రీకరణ పై పలుమార్లు చర్చ జరిగిందన్న ప్రొబెషనరీ ఐఏఎస్‌లు. గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యమవుతుందన్నారు. మహిళాభివృద్ధి మీద ప్రభుత్వం మంచి చిత్తశుద్ధితో ఉందని, నిన్నటి వరకు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నాం, ఇప్పుడు నేరుగా ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నామని చెప్పుకొచ్చారు. కొత్తగా అమలు చేస్తున్న గ్రామ వాలంటీర్లు వ్యవస్ధ, అధికార వికేంద్రీకరణ వంటి కొత్త వ్యవస్ధలో పనిచేయడంపై హర్షం వ్యక్తం చేశారు.