Chandrababu: నోటీసు ఇవ్వకుండా నన్ను అరెస్టు చేశారు.. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది

Chandrababu: నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది

Update: 2023-09-22 07:52 GMT

Chandrababu: నోటీసు ఇవ్వకుండా నన్ను అరెస్టు చేశారు.. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది

Chandrababu: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పును మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత కస్టడీ పిటిషన్‌పై న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలా 30 నిమిషాలకు తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. ఇటు హైకోర్టులో క్యాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ తీర్పు కూడా మధ్యహ్నం 1గంటలా 30నిమిషాలకు హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపుపై ఇప్పటికే ఏసీబీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రెండు రోజుల పాటు రిమాండ్‌ పొడిగించారు. చంద్రబాబు రిమాండ్ ఎల్లుండి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విచారణ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనది 45ఏళ్ల రాజకీయ జీవితమని చంద్రబాబు జడ్జికి తెలిపారు. తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చంద్రబాబు అన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని చెప్పారు. అన్యాయంగా తనను అరెస్టు చేశారని చెప్పారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చంద్రబాబు జడ్జితో అన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు వాదనలు విన్న తర్వాత జడ్జీ స్పందించారు. మీ మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమే అని న్యాయమూర్తి చంద్రబాబుతో అన్నారు. ఈ కేసులో ఇంకా ఎలాంటి తీర్పు రాలేదని న్యాయమూర్తి చంద్రబాబుకు చెప్పారు. కోర్టుకి ఒక విధానం ఉంటుందని.. వాటిని ఎవరు మార్చలేరన్నారు. కోర్టు దాని పరిధిలో పని చేస్తోందని న్యాయమూర్తి తెలిపారు. జ్యూడిషియల్ కస్టడీలో ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలంటూ న్యాయమూర్తి చంద్రబాబు అడిగారు. మానసికంగా బాధపడవద్దంటూ చంద్రబాబుకు న్యాయమూర్తి సూచించారు.

Tags:    

Similar News