Ushashri Charan: వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా
Ushashri Charan: అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా
Ushashri Charan: ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. సీఎం జగన్ చేపడుతున్న మార్పులు, చేర్పుల్లో భాగంగా కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానాన్ని బోయ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని అన్నారు. అందులో భాగంగానే తనను పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటిస్తానని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు.