KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. సోమవారం నుంచి కేఏపాల్ ఆమరణ నిరాహార దీక్ష
KA Paul: స్టీల్ ప్లాంట్‌ను అమ్మబోమని కేంద్రం ప్రకటించాలని డిమాండ్
KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మబోమని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికార ప్రకటన చేయకపోతే సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రజా శాంతి పార్టీ అద్యక్షులు కేఏ పాల్ తెలిపారు. కేంద్రం మన రాష్ట్రానికి మొండి చేయి చూపుతుందని ఆరోపించారు. మనం కట్టిన పన్నులను గుజారత్ కు తరలిస్తున్నారని విమర్శించారు. ఒక్క స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటే మన రాష్ట్రానికి వున్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే పది లక్షల కోట్ల అప్పు తీరుస్తానని చెప్పారు.