Srisailam: శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

దర్శనానికి పెద్ద ఎత్తున క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులు

Update: 2024-05-26 10:00 GMT

Srisailam: శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ 

Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం నుంచి భక్తుల తాకిడి పెరగటంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే.. రేపు ఇంతకన్నా ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో.. సిబ్బందికి ప్రత్యేక విధులు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలని ఈవో పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు. దర్శనం కోసం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.

వేసవి సెలవులు ముగుస్తుండడం మరోపక్క టెన్త్, ఇంటర్, డిగ్రీ, విద్యార్థులు పరీక్షల ఫలితాలు వెలువడటంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు,అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News