Srisailam Temple: శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
Srisailam Temple: ఆదివారం సెలవురోజు కావడంతో పోటెత్తిన భక్తులు
Srisailam Temple: శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో బారుల తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు స్వామిఅమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఆలయంలో రద్దీ దృష్ట్యా క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసంం క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.