Tirumala: వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
Tirumala: శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో వేచిఉన్న భక్తులు
Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకు చేరుకుంది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో భక్తులు నిండి వెలుపల కిలోమీటర్ల మేర క్యూలో ఉన్నారు.