తిరుమల కొండపై రెండోరోజు భక్తుల రద్దీ.. 5 కి.మీ.మేర నిలిచిపోయిన క్యూలైన్లు
Tirumala: గోగర్భం డ్యాం సర్కిల్ వరకు క్యూలైన్లు.. రేపటి వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశాలు
Tirumala: తిరుమల కొండపై రెండోరోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 48 గంటల పాటు క్యూలైన్లలో పడిగాపులు కాస్తే కానీ.. శ్రీవారి దర్శన భాగ్యం కలగడం లేదు. భక్తజనంతో తిరుమల కొండంతా నిండిపోవడంతో.. క్యూలైన్లు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఆలయం వద్ద నుంచి శిలాతోరణం మార్గం గుండా గోగర్బం డ్యాం సర్కిల్ వరకు క్యూలైన్లు నిలిచాయి. రేపటి వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.