Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ఎలాంటి టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది.
Tirumala: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 19 కంపార్టుమెంట్లలో భక్తుల వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. కాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 83 వేల 740 మంది నిన్న శ్రీవారిని దర్శించుకోగా.. 35 వేల 462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3 కోట్ల 71 లక్షల ఆదాయం సమకూరింది.