తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

Update: 2024-04-21 04:30 GMT

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమల వెంకటేశ్వరుడి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండపైకి పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా... 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. కాగా 73 వేల మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా.. 34 వేల 599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీకి 2 కోట్ల 92 లక్షల ఆదాయం చేకూరింది. మరోవైపు ఇవాళ్టి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్సిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి రేపు స్వర్ణరథంపై ఊరేగనున్నారు. దీంతో మూడ్రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.

Tags:    

Similar News