Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala: శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు

Update: 2024-04-12 04:00 GMT

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు ఎలాంటి పోటెత్తుతున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండడంతో భక్తులు వెలుపల క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 62 వేల 366 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా.. 29 వేల 633 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఇక నిన్న శ్రీవారి హుండీకి 3 కోట్ల ఆదాయం చేకూరింది. ఇక ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో ‌శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనుంది టీటీడీ. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది. ఏప్రిల్ 18వ తేదీన ‌శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనుంది టీటీడీ.

Tags:    

Similar News