తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం
Tirumala: రూ. 300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం
Tirumala: తిరుమలలో భారీగా రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. టోకెన్లు లేకుండా వచ్చేవారికి 16 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల టికెట్ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.