Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Tirumala: శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Update: 2024-05-19 14:15 GMT

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు బారులుదీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని TTD ప్రకటించింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. TTD JEO వీరబ్రహ్మం, డిప్యూటీ EO హరీంద్రనాథ్‌, TTD భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది.

Tags:    

Similar News