Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Tirumala: అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలో నిల్చున్న భక్తులు
Tirumala: తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల వరకు నిల్చున్నారు భక్తులు. ఎలాంటి టోకెన్లు లేనివారికి 24 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయాల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. కాగా 90 వేల 721 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా.. 50 వేల 599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3 కోట్ల 28 లక్షల ఆదాయం చేకూరింది.