Andhra Pradesh: కర్నూలు జిల్లాలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం
Andhra Pradesh: పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో * బయటపడ్డ రూ.3 కోట్ల 35 లక్షల 500
Andhra Pradesh: కట్టలు... కట్టలు... కళ్ళు చేదిరే నోట్ల కట్టలు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు కోట్ల పై చిలుకు కరెన్సీ కట్టలు చూసిన పోలీసులు షాక్ తిన్నారు. కర్నూలు జిల్లా శివారు పంచలింగాల సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలో ఓ ప్రైవేట్ బస్సు లో బయట పడిన నోట్ల కట్టాలపై స్పెషల్ స్టోరీ.
సుమారు 3 కోట్ల 35 లక్షల అయిదు వందల రూపాయలు కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేసిన తనిఖీల్లో బయట పడ్డాయి. ఈ మొత్తం కరెన్సీ చెన్నై నగరానికి చెందిన రామచంద్ర మెడికల్ కళాశాలకు చెందిందిగా పోలీసుల విచారణలో తేలింది. ఈ డబ్బు తరలింపునకు సంబంధించిన ఎలాంటి అధికారిక పత్రాలు లేవు.
అక్రమంగా మూడు కోట్లకు పైగా డబ్బు తరలిస్తున్న బి.ఏ. చేతన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు వాసి అయిన చేతన్ చెన్నైకి చెందిన అరుణ్ వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చేతన్ పై అరుణ్ కు గట్టి నమ్మకం ఏర్పడింది. దీంతో మార్చి 28న చేతన్ ను విమానంలో రాయిపూర్ పంపాడు. అక్కడే ఇతనికి కొందరు ఈ మూడు కోట్ల పై చిలుకు డబ్బు అందించారు.
కర్నూలు జిల్లా మీదుగా నగదు, బంగారం అక్రమంగా తరలించే వారిపై పోలీసులు నిఘా పెట్టటంతో భారీగా నగదు, బంగారం బయట పడుతోంది. గత రెండు నెలలుగా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద జరిపిన పోలీసుల తనిఖీలలో ఎనిమిది కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 12 కేజీల వెండి, అయిదు వందల గ్రాముల డైమాండ్స్ పట్టుకున్నారు.