Chandrababu Naidu: దర్యాప్తు అధికారి రాకుండా ఎలా అరెస్ట్ చేస్తారు..?
Chandrababu Naidu: చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న సీఐడీ చివరకు ధర్మమే గెలుస్తుంది
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఉదయం 5 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌విత్ 34 మరియు 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు. చంద్రబాబును కలువనీయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు.