Taneti Vanitha: బిడ్డల సంరక్షణ బాధ్యత మొదట తల్లిదే
Taneti Vanitha: అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పీఎస్‌లను, యాప్‌లను తీసుకొచ్చాం
Taneti Vanitha: బిడ్డల సంరక్షణ బాధ్యత మొదట తల్లిదేనన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యతను తల్లి చూసుకుంటుందని.. ఆమె కూడా ఉద్యోగం కోసమో, కూలి పనుల కోసమో బయటకు వెళ్తుండడంతో పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతున్నారని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగుపొరుగువారు, బంధువులు, కొన్ని చోట్ల తండ్రులే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా పక్షపాతి అయిన తమ ప్రభుత్వం అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పీఎస్‌లను, దిశ యాప్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఇలాంటి కేసుల్లో ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు.