బెజవాడలో కలకలం రేపుతున్న వరుస హత్యలు

విజయవాడ నగరవాసులను వరుస హత్యలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సమస్యలు వేరైనా హత్యే పరిష్కారంగా రెచ్చిపోతున్నారు. వరుస ఘటనల్లో బలైపోతోంది మాత్రం మహిళలే.. అటు పోలీసులకు ఒక హత్య కేసును చేధిస్తే.. మరో మర్డర్ ఛాలెంజ్ విసురుతోంది.

Update: 2020-10-27 17:15 GMT

విజయవాడ నగరవాసులను వరుస హత్యలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సమస్యలు వేరైనా హత్యే పరిష్కారంగా రెచ్చిపోతున్నారు. వరుస ఘటనల్లో బలైపోతోంది మాత్రం మహిళలే.. అటు పోలీసులకు ఒక హత్య కేసును చేధిస్తే.. మరో మర్డర్ ఛాలెంజ్ విసురుతోంది. బెజవాడ వరుస హత్యలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం..

విజయవాడ నగర కమీషనరేట్ ఉద్యోగి హత్య.. అర్ధరాత్రి పేలుళ్ళతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. కమీషనరేట్ ఉద్యోగికే రక్షణ లేదా అంటే ఆ ప్రాంతం నిర్మానుష్యం కావడం, అక్కడ అసాంఘిక వాతావరణం ఉండటం, వారి మద్య సంభాషణ తీవ్ర స్ధాయికి చేరడం హత్యకు కారణంగా తెలుస్తోంది. ఇది సుపారీ కేసు అని కాసేపు.. క్షణికావేశంలో, మద్యం మత్తులో జరిగిన పేలుళ్ళ కేసని భావించినా.. చివరికి ఈ హత్యకు మరో లింక్ ఉందంటూ తేల్చారు పోలీసులు.

మహేష్ కేసు పూర్తవకుండానే దివ్య తేజస్విని హత్య నగరంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో పెళ్ళి ఫోటోలు కేసును లెఫ్ట్ టర్న్ తిప్పితే, దివ్య వీడియో వచ్చి రైట్ టర్న్ తిప్పింది. వీటితో పాటు వాయిస్ మెసేజ్ లతో రోజుకో కొత్త కోణం వెలుగులోకొచ్చింది. ఇదీ క్షణికావేశమే అని నాగేంద్ర బంధువులు అంటుంటే, కాదు కావాలనే నిద్రపోతున్న అమ్మాయిని చంపాడని ఆరోపించారు దివ్య తలిదండ్రులు ఆరోపించారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టుం నివేదికలు దివ్య తలిదండ్రులనే బలపరిచాయి.

మరోవైపు దివ్య కేసు కోర్టుకు వెళుతుందనుకుంటూ ఉండగానే, కృష్ణలంకలో భార్యను హతమార్చాడో కిరాతకుడు. ఆటో నడిపే కృపానందం, భార్య నాగమణి మధ్య కొంత కాలంగా విబేధాలున్నాయి. పిల్లల విషయంలో కూడా దుర్భాషలాడాడని నాగమణి తలిదండ్రులు ఆరోపించారు. ఈ కేసులో అక్రమ‌ సంబంధం కోణం కూడా ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. ఫోన్లో నాగమణి తల్లికి అనుమానంతో చంపినట్టు చెప్పాడని నాగమణి తల్లే చెప్పడంతో, ఈ కేసులో మిస్టరీ కంటిన్యూ అవుతోంది.

ఒకే నెలలో మూడు హత్యలు జరగడం.. నగరంలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోన్న భయం బెజవాడ ప్రజల్లో లేకపోలేదు. అటు పోలీసులకు వరుస హత్యలు సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. 

Tags:    

Similar News