తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్..

-ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న జేసీ బ్రదర్స్‌ -తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు

Update: 2021-01-04 01:51 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు జేసీ బ్రదర్స్‌ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందని తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇంకోపక్క శాంతియుతంగా దీక్ష చేపడతామని జేసీ వర్గీయులు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగంపై జేసీ సోదరులు సోమవారం తాడిపత్రిలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై దుర్వినియోగంపై శాంతియుతంగా నిరసన దీక్ష చేపడతామంటే ఈ ఆంక్షలు ఏమిటని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా చేపట్టిన దీక్షకు భారీగా పోలీసులను రప్పించడం ఏంటని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. కరోనా కారణంగా తన ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఆందోళనతో సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనకు మద్దతుగా.. నిరసన దీక్షలో పాల్గొననున్నారని తెలిపారు.

Tags:    

Similar News