Andhra Pradesh: ఆగని హింస.. పరస్పరం దాడులు చేసుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు

Andhra Pradesh: పోలింగ్ ముగిసి రెండ్రోజులవుతున్న ఆగని హింస

Update: 2024-05-15 06:05 GMT

Andhra Pradesh: ఆగని హింస.. పరస్పరం దాడులు చేసుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు

Andhra Pradesh: ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస పోలింగ్ ముగిసి రెండ్రోజులైనా కూడా చల్లారడంలేదు. రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం కనిపిస్తూనే ఉంది. తలలు పగిలినా, కాళ్లు విరిగినా దాడులు చేసుకునేందుకు వెనుకాడడంలేదు. బిహార్, యూపీలో అల్లర్లకు మించి ఏపీలోని నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు.

తాజాగా పల్నాడు జిల్లాలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. మాచవరం మండలంలో వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. మాచవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతున్న తమపై టీడీపీ నాయకులు దాడి చేశారని దాడిలో తమ కారు ధ్వంసమైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News