Breaking News to AP Inter Students: విద్యా వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం...
Breaking News to AP Inter Students: కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏయే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆయా పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలను ఇంటర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో గత వారంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పదో తరగతి పాసైన చాలా మంది ఇంటర్ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదన్న అంశంపై చర్చించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఇంటర్ చదివేందుకు మొగ్గు చూపడం లేదని. దూరభారం వల్లే ఈ సమస్య వస్తోందని ఆ సమావేశంలో వారు అభిప్రాయపడ్డారు. కాగా అధికారులు విద్యార్థుల సౌకర్యార్థం మండల స్థాయిలోనే ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని. దీంతో ఇంటర్ లో అడ్మిషన్లను గణనీయంగా పెంచొచ్చని ఉన్నాతాధికారులు భావించారు. ఇప్పటికే ఈ విషయం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళామని, దానికి ఆయన వెంటనే స్పందించి ఆమోదం తెలిపారని అన్నారు. దీంతో అధికారులు జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఉన్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.