Andhra Pradesh: ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
Andhra Pradesh: కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం * టెన్త్ ఎగ్జామ్స్ వాయిదాపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
Andhra Pradesh: కరోనా కట్టడి పై ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో ఇవాళ హై లెవల్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో కరోనా నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పదవ తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్ పరీక్షలు వాయిదా పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరీక్షల రద్దుతో పాటుగా స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది. రాత్రి కర్ఫ్యూపై కూడా క్లారిటీ రానుంది. బార్లు, రెస్టారెంట్ల, దేవాలయాలు, మత సంస్థల్లో కరోనా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. ఇక వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.