TTD Board Meeting: ఇవాళ టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన హై లెవల్ కమిటీ సమావేశం

TTD Board Meeting: భక్తుల భద్రత దృష్ట్యా నడక మార్గం టోకెన్లు రద్దు చేసే యోచనలో టీటీడీ

Update: 2023-08-14 03:55 GMT

TTD Board Meeting: ఇవాళ టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన హై లెవల్ కమిటీ సమావేశం

TTD Board Meeting: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ హై లెవల్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, టీటీడీ సివి అండ్ ఎస్వోతో పాటు మరికొంత మంది అధికారులు పాల్గొననున్నారు. ప్రధానంగా..నడకదారి భక్తుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దర్శన టోకెన్ కోసం నడకదారిన వచ్చే భక్తుల ఇక్కట్లు తొలగించాలని టీటీడీ భావిస్తోంది.. ఈ నేపథ్యంలో.. నడకదారి భక్తులకు జారి చేసే దర్శన టోకెన్ల విధానాన్ని రద్దు చేసి.. సర్వదర్శన టోకన్లు పెంచే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న 15 వేల టోకెన్ల సంఖ్యను 30 వేలకు పెంచే అవకాశముంది. వీటన్నింటితో పాటు... మరికొన్ని కీలక నిర్ణయాలను సమావేశం అనంతరం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది..

ఇక.. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. ఏడవ మైలు నుండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకూ 100 మంది భక్తులను ఒకే సారి గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. భద్రతా సిబ్బంది నడుమ రోపుల సహాయంతో భక్తులను సురక్షితంగా పంపిస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో చిన్నారులు తప్పి పోకుండా ట్యాగ్స్ వేయడంతో పాటు, చంటి పిల్లల తల్లిదండ్రులకు సూచనలు చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల‌ నుండి ఉదయం 6 గంటల వరకూ ద్విచక్ర వాహనాలను అనుమతిని టీటీడీ రద్దు చేసింది..

ఇదిలా ఉంటే.. చిరుత సంచారం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం‌ ఒక్క రోజే‌ అలిపిరి‌ నడక మార్గం, ఘాట్ రోడ్డులో మొత్తం ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలలో, గాలిగోపురం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.. ఆదివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో రెండోవ ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత వాహనదారులను తారాస పడింది.

వాహనదారులు సమాచారం మేరకు ఘటన స్ధలాన్నికి చేరుకున్న అటవి శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.. అదే విధంగా ఆదివారం సాయంత్రం 2 వేల 450వ మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు‌ వెంటనే సమీపంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులి మళ్లీ నడక మార్గంలోకి రాకుండా భారీ శబ్దాలు చేస్తూ అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేస్తున్నారు..

Tags:    

Similar News