ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ప్రకటన

* నిమ్మగడ్డను ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారులు కలవాలన్న కోర్టు * నేటి నుంచి మూడు రోజుల్లోపు ఎస్‌ఈసీతో చర్చించాలని ఆదేశం * రాష్ట్రంలో కరోనా కారణంగా ఎన్నికలు జరపలేమంటున్న ప్రభుత్వం..

Update: 2020-12-29 06:50 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి మూడ్రోజుల్లోపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డను ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారులు కలవాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు జరపలేమంటున్న ప్రభుత్వం.. ఆ వివరాలను నిమ్మగడ్డకు వివరించాలని ఆదేశించింది. ఎక్కడ కలవాలనే విషయాన్ని నిమ్మగడ్డ చెబుతారని తెలిపింది. అప్పటికీ.. ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Tags:    

Similar News