నిమ్మగడ్డకు షాక్.. ఆ యాప్ నిలిపేస్తూ ఆదేశాలిచ్చిన హైకోర్ట్!

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో క్షణం క్షణం ఊహించని పరిణాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2021-02-05 09:33 GMT

నిమ్మగడ్డ హైకోర్టు

ఏపీ పంచాయతీ ఎన్నికలల్లో క్షణం క్షణం ఊహించని పరిణాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ సర్కార్ ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవలే ఎస్ఈసీ నిర్మగడ్డ తీసుకొచ్చిన యాప్ E-Watch App ను హైకోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సీ విజిల్ యాప్ ఇప్పటికే ఉండగా, మరో యాప్ తీసుకురావడం సరికాదని వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో హైకోర్టు ఈ వాచ్ యాప్ మీద విచారణ జరిపింది. దీనికి భద్రతా పరమైన అనుమతులు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనికి మరో 5 రోజుల్లో భద్రాపరమైన అనుమతులు వస్తాయని వాదించారు. దీంతో ఈ వాచ్ యాప్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9 వరకు యాప్‌ను అమల్లోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది.

మరో వైపు నిమ్మగడ్డ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార వైసీపీకి షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా, నిమ్మగడ్డ ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగిన చిత్తూరు, గుంటూరు జిల్లాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన చేయరాదని గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. 

Tags:    

Similar News