Krishna Water Row: జలవివాదం.. ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం

Krishna Water Row: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది.

Update: 2021-06-30 09:50 GMT

Krishna Water Row: జలవివాదం.. ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం

Krishna Water Row: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి ఆమోదముద్ర వేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు 5వేల 990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. టిడ్కో ద్వారా 2 లక్షల 62 వేల 216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదించింది. జేఎన్‌టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలు, ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు, 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలుపుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై ఏపీ కేబినెట్ తీర్మారం చేసింది. ఏపీ హక్కులకు సంబంధించి రాజీ పడేది లేదని మంత్రివర్గం స్పష్టం చేసింది. శ్రీశైల జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని తప్పుబట్టింది ఏపీ కేబినెట్. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

Tags:    

Similar News