Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు.. గోదావరి ప్రస్థుత నీటిమట్టం 45.2 అడుగులు
Bhadrachalam: లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచన
Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 45.2 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా తాళిపేరు ప్రాజెక్ట్, కిన్నెరసాని ప్రాజెక్ట్ నీరు దిగువకు వదలడంతో భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి వద్ద ఏర్పాటు చేసిన భారీ మోటర్లు మొరాయించడంతో పరిసర ప్రాంతాలు జలమయ్యయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మోటార్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. మరోవైపు.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. గోదావరిలో నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.