AP Rains: ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

AP Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం

Update: 2022-10-06 07:38 GMT

AP Rains: ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

AP Rains: ఏపీలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గి కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News