జలదిగ్భంధంలో తిరుపతి.. ఆలయంలోకి అనుమతి నిలిపివేసిన టీటీడీ
Tirumala: ఆద్యాత్మిక నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది.
Tirumala: ఆద్యాత్మిక నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది. తెల్లవారుజాము నుంచీ కురుస్తున్న భారీ వర్షానికి నగరంలో అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. స్థానిక మధురానగర్‌లో భారీగా నీటి ప్రవాహం కనిపిస్తోంది. ప్రధాన రోడ్లలో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.
మరోవైపు తిరుమల కపిలతీర్థం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఆలయ పరిశరాల్లో భారీగా వరద ప్రవహిస్తుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులను ఆలయంలోకి అనుమతించకుండా చర్యలు చేపట్టారు. కపిలతీర్థంతో పాటు అక్ష్మీనారాయణ స్వామీ, వేణుగోపాలస్వామి ఆలయాల్లోకి కూడా భారీగా వరద చేరింది.