Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

*వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశం *తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

Update: 2021-10-17 04:23 GMT

బంగాళాఖాతంలో బలహీనపడుతున్న అల్పపీడనం(ఫైల్ ఫోటో)

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుంది. వచ్చే 24 గంటల్లో మరింత బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.

అటు ఏపీలోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపటితో బలహీనపడనుండగా.. ఈనెల 27న మరో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ఒడిశా, పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు.

Tags:    

Similar News