ఏపీకి భారీ వర్ష సూచన
దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం..
దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని పేర్కొంది.
మరోవైపు ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.అయితే ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని.. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల.. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర మత్సకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లోద్దని అధికారులు సూచించారు. ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.