Rain alert: ఈ జిల్లాలకు భారీ వర్షసూచన..జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ
Rain alert: నేడు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Rain alert: నేడు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసిమ, తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి, అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుగొర్ల కాపరులు చెట్లు, కరెంటుపోల్స్, టవర్స్ కింద ఉండకూడదని సూచించారు.