Rain Alert: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారంలోకా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ విభాగం భావిస్తోంది.
నైరుతీ బంగాళాఖాతంలో ఆవర్తనంగా స్థిరంగా కొనసాగుతోంది. ఇది మంగళశారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దానికి తోడుగా ఒక ద్రొణి కూడా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య మంగళవారం, బుధవారం, ఏపీలోని కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో దీని ప్రభావం మంగళ, బుధ, గురువారాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
అయితే సోమవారం ఏపీపై అల్పపీడన ప్రభావం భాగా కనిపించబోతున్నట్లు తెలిపారు. 12 తర్వాత నుంచి ఏపీ అంతటా భారీగా మేఘాలు కమ్ముకుంటాయి. తూర్పు తెలంగాణలో అక్కడక్కడ మేఘాలు వస్తూపోతూంటాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి మేఘాలు ఉంటాయి.
ఏపీలో గంటకు 17 కిలోమీటర్లుగా గాలివేగం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలో గాలుల వేగం పెరుగుతుంది. తెలంగాణలో 31 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 34 డిగ్రీల సెల్సియస్ ఉండగా..సోమవారం మధ్యాహ్నం నుంచి ఏపీలో ఎండ వేడి కూడా తగ్గుతుంది.