ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్
నివర్ తుపాను ఏపీని నేరుగా తాకకపోయినా దాని ప్రభావం ఉథృతంగా ఉంటుందని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారు.
నివర్ తుపాను ఏపీని నేరుగా తాకకపోయినా దాని ప్రభావం ఉథృతంగా ఉంటుందని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారు. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకూ తుపాను ప్రభావం ఉండొచ్చని అన్నారు. తుఫాను నేపధ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలక్టరేట్లు మండల కేంద్రాల్లో ఎన్డీఆరెఫ్, ఎస్డీ ఆరెఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారు.
అక్టోబర్ నెల వర్షాలతో రిజర్వాయర్లు నిండాయని ఇప్పుడు మళ్లీ వర్షాలు పడితే చెరువులకు గండ్లు పడే అవకాశముందని జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. పంటలు దెబ్బ తినకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోత కోసిన పంటలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని, కోయకపోతే పొలంలోనే వాటిని జాగ్రత్తగా కాపాడాలని సూచించారు. ప్రాణ ఆస్తినష్టం జరగకుండా చూడాలని ఎన్డీఆరెఫ్, ఎస్డీ ఆరెఫ్ బృందాల సహాయాన్ని తీసుకోవాలన్నారు. మరోవైపు తుఫాను ప్రభావం పై వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 65నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంది.