నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని.. వర్షపాతం..

Update: 2020-10-19 02:30 GMT

భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని.. వర్షపాతం కూడా అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఆ తరువాత 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వెల్లడించారు.

దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అంతేకాకుండా ఈ నెల 20న కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలావుంటే గడచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలోని కారంచేడు, చీమకుర్తిలో 4 సెం.మీ, కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు, నర్సాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని యానాంలో 3, అమలాపురం, చింతలపూడి, తణుకులో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం కురిసింది.

Tags:    

Similar News