ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. దీంతో గతేడాదితో పోల్చుకుంటే సుమారు 25 శాతం మేర ఆదాయం కూడా తగ్గింది. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యన మద్యం, బీర్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 10,282 కోట్ల ఆదాయం రాగ ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కేవలం రూ. 7,706 కోట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. అంటే బీర్ల అమ్మకాలు సుమారు 89 శాతం పడిపోయింది.
అంటే 2019-2020లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 159.35 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. అదే విధంగా మద్యం విక్రయాలు కూడా సుమారు 64 శాతం మేర పడిపోయాయి. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 166 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరగగా ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కేవలం 65.62 లక్షల కేసుల మద్యం మాత్రమే సేల్ అయ్యాయి. అయితే ఈ మధ్యం అమ్మకాలు తగ్గడానికి ఆదాయం తక్కువగా రావడానికి ఓ వైపు కరోనా కారణం అయితే మరో వైపు ధరల పెంపుకూడా పెద్ద కారణమం.