Harirama Jogaiah: సీఎం జగన్‌పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం
Harirama Jogaiah: రాజశేఖర్‌రెడ్డి హుందాతనంలో 10% కూడా జగన్‌లో కనిపించడం లేదు
Harirama Jogaiah: సీఎం జగన్‌పై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. లేఖలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవన్నారు. ఆయన హుందాతనంలో 10శాతం కూడా జగన్‌లో కనిపించడం లేదని తెలిపారు. చట్ట ప్రకారం విడిపోయి విడాకులు తీసుకున్న వారు మరో వివాహం చేసుకోవడానికి అభ్యంతరమలేదని తెలిపారు. పదే పదే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. పవన్‌ను విమర్శించడానికి మరో విషయం లేకనే జగన్ అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.