కరోనా సోకిందంటూ వరుడి అదృశ్యం.. చివరకు..
Groom escapes: అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు.
Groom escapes: అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నానంటూ బంధువులకు ఫోను ద్వారా చెప్పి వివాహానికి బ్రేక్ పడేలా చేశాడు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలలో ఈ సంఘటన జరిగింది.
రాంకుమార్ అనే వ్యక్తికి ఇటీవల కొత్త చెరువుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అతనికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, పెళ్లి చేసుకోలేక సతమతం అయ్యాడు. తీరా పెళ్లి సమయం దగ్గరపడిన తర్వాత తనకు కరోనా వచ్చిందని చెప్పి ఎవరూ చూడకముందే ఉడాయించాడు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. తనకు కరోనా వ్యాధి సోకిందని, తనను అనంతపురం నారాయణ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారని బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా చెప్పాడు. అయితే కుటుంబసభ్యులు, బంధువులు ఏం జరిగిందని ఆరా తీశారు. అధికారులను వివరణ కోరగా రామ్‌కుమార్ అనే వ్యక్తిని తాము ఎక్కడికి తీసుకెళ్లలేదని చెప్పారు. పెళ్లి ఇష్టంలేకనే వరుడు ఈ నాటకం ఆడినట్లు తేలింది.