Govinda Koti: గోవింద కోటి కార్యక్రమానికి విశేష స్పందన
Govinda Koti: గోవింద కోటి రాసేందుకు ముందుకొస్తున్న విద్యార్థులు, యువత
Govinda Koti: టీటీడీ దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో పాలకమండలి తీసుకున్న గోవింద కోటి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. చిన్నారులు, యువతలు సనాతన ధర్మం, మానవీయ విలువలు, మానవ సంబంధాల గురించి అవగాహన, ఆసక్తి పెంచడానికి టీటీడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, యువత గోవింద కోటి రాయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తిరుపతి నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు గోవింద కోటి రాసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.