Grandhi Srinivas: చదువుకుంటానని బాలుడితో మాట తీసుకున్న ఎమ్మెల్యే
Grandhi Srinivas: నరసింహపురంలో బాలుడితో గ్రంధి శ్రీనివాస్ ప్రమాణం
Grandhi Srinivas: టీచర్ కొట్టారని చదువు మానేస్తే మన భవిష్యత్తు పాడవుద్ది.. చిన్నప్పుడు మమల్నీ కొట్టారు మన భవిష్యత్ కోసమే.... బాగా చదువుకుని ఉద్యోగం చేసి కుటుంబం అందరినీ బాగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు... అంటూ ఓ బాలుడితో ప్రమాణం చేయించుకున్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.... ఈ సంఘటనతో ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నరసింహపురంలో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరాలు అందిస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు పలువురు తమ సమస్యలు చెప్పినప్పుడు జరిగిందీ సంఘటన.... మరో చోట... అన్నా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం... ప్రభుత్వ సహాయం అందలేదని చెప్పిన మహిళతో.. జగనన్న మాట ఇచ్చారు.. నేనున్నా నీకు సహాయం అందిస్తా... ధైర్యంగా, సంతోషంగా ఉండు చెల్లెమ్మా... అంటూ ఎమ్మెల్యే అభయమిచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.