Governor Quota MLC YSRCP Candidates Finalized: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ
Governor quota MLC YSRCP candidates finalized: ఏపీలో గవర్నర్ కోటా ఎమేల్సీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కడప జిల్లా రాయచోటి కి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం పేరును, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజు పేర్లను వైసీపీ ఖరారు చేసింది. ఇరువురినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్ ను ప్రభుత్వం కోరింది.