వారి ఎకౌంట్లలోకి పదివేలు! రెండో దఫా వాహనమిత్ర

ఆటోలు, క్యాబ్ లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న యాజమానులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ ఆర్ వాహనమిత్ర పథకం రెండో విడత నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

Update: 2020-06-04 03:31 GMT

ఆటోలు, క్యాబ్ లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న యాజమానులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ ఆర్ వాహనమిత్ర పథకం రెండో విడత నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.ఈ పథకంలో భాగంగా గత ఏడాది అక్టోబరులో ఒక విడత నిధులను మంజూరు చేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ. 10వేల చొప్పున సంబంధిత యాజమాని బ్యాంకు అకౌంట్లో జమ చేశారు. అయితే రెండో విడతలో భాగంగా ఈ ఏడాది అక్టోబరులో నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా లాక్ డౌన్ నేపథ్యంలో నాలుగు నెలలు ముందుగా వీటిని జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా లబ్ధిదారులు ఎంపిక పూర్తిచేయగా, ఈ రోజు సీఎం జగన్మోహనరెడ్డి నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్ఆర్ వాహనమిత్ర పధకానికి సంబంధించి రెండో విడత సొమ్మును ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులను జమ చేయనున్నారు. ఈ పధకం ద్వారా మొత్తం 2,62,493 మందికి రూ. 262.49 కోట్ల ఆర్ధిక సాయం అందించనుండగా.. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా రూ. 10 వేలు చొప్పున జమ కానున్నాయి.

గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 37,756 మంది లబ్దిదారుల జాబితాలో చేరారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో అక్టోబర్‌లో ఇవ్వాల్సిన సాయాన్ని నాలుగు నెలల ముందుగానే ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇకపోతే గతేడాది సెప్టెంబర్ 23 నుంచి ఈ ఏడాది మే 16 మధ్య కొత్తగా వాహనాలు కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారికి కూడా ఈ పధకాన్ని వర్తింపజేశారు.

ఇదిలా ఉంటే వైఎస్ఆర్ వాహనమిత్ర పధకంకు సంబంధించి లబ్దిదారుల జాబితాలో అత్యధికంగా బీసీలే ఉన్నారు. మొత్తం లబ్దిదారుల్లో 1,17,096 మంది బీసీలు ఉండగా.. ఎస్సీలు 61,390, ఈబీసీలు 14,592, కాపులు 29,643, ఎస్టీలు 10,049, మైనార్టీలు 28,118, బ్రాహ్మణులు 581, క్రైస్తవులు 1,026 ఉన్నారు. కాగా, ఈ పధకం కింద లబ్దిదారులకు ప్రతీ ఏటా ప్రభుత్వం పది వేలు సాయం చేయనుంది

Tags:    

Similar News