Gorantla Madhav: చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్
Gorantla Madhav: ఫేక్ వీడియోతో తెలుగుదేశం పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఎంపీ మాధవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Gorantla Madhav: ఫేక్ వీడియోతో తెలుగుదేశం పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఎంపీ మాధవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వీడియో ఒరిజినల్ కాదని కాణిపాకం వినాయకుడివద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ఓటుకు నోటుకేసులో వీడియోపై ప్రమాణం చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఫేక్ వీడియో చేతబట్టుకుని ఓ బీసీ ఎంపీని ఇంతలా వేధిస్తున్నారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఆ వీడియోలో ఉన్నది తానేనని, ఆ వీడియో ఒరిజినలేనని తేలితే... తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించేది తానేనని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.