Tirumala: భక్తులకు గుడ్‌న్యూస్‌.. మరింత రుచి, నాణ్యతగా తిరుపతి లడ్డూ

Tirupati Laddu: టీటీడీ కొత్త కార్యనిర్వాహణాధికారి సీనియర్ ఐఎఎస్ అధికారి జే శ్యామలరావు తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.

Update: 2024-07-24 04:54 GMT

Tirumala laddu : మరింత రుచిగా తిరుమల శ్రీవారి లడ్డు..కారణం ఇదే

Tirupati Laddu: టీటీడీ కొత్త కార్యనిర్వాహణాధికారి సీనియర్ ఐఎఎస్ అధికారి జే శ్యామలరావు తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టారు. నాణ్యతను పరిశీలించడానికి అప్పటికప్పుడు తయారు చేసిన లడ్డూలను తెప్పించుకుని రుచి చూశారు. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి, బేసన్, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పును ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తోన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన నెయ్యి వాడితే లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని ఈవో తెలిపారు. అడల్ట్రేషన్‌ను టెస్ట్ చేసే పరికరం మన వద్ద లేదు ప్రొక్యూర్ మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కాంట్రాక్టర్ మరో సబ్ కాంట్రాక్టర్ కు సబ్ లీజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిపై నలుగురు సభ్యులతో నిపుణుల కమిటి ఏర్పాటు చేశామన్నారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్‌లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశ నిర్ధేశం చేస్తుందంటూ నెయ్యికి ఆరోమా చాలా అవసరం వీటిద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరామన్నారు. ఇప్పుడు నెయ్యి సప్లయ్​చేసే సంస్థలను క్వాలిటి నెయ్యి సరఫరా చేయాలని సూచించారు. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్‌లో తేలడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి మరో కంపెనీపై చర్యలు తీసుకుంటున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు.

తిరుమలలో అడల్ట్రేషన్ టెస్టింగ్ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్గానిక్ ఆహార పదార్థాలు వాడటం వల్లే శ్రీవారి అన్నప్రసాదాల్లో రుచి తేడా వస్తుందన్నారు. గతంలో కంటే మిన్నగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాలని ఈవో శ్యామలరావు పోటు సిబ్బందిని ఆదేశించారు. భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని, లోపాలు తలెత్తకూడదని చెప్పారు.

Tags:    

Similar News