విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రయాణికులకు రైల్వే శుభవార్త అందించింది. ఈ నెల 12 నుంచి రైళ్లను పెంచనున్నట్టు తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న 12 రైళ్ళకు అదనంగా మరో 24 రైళ్లు పెంచాలని నిర్ణయించింది. రైళ్లలో రాకపోకలకు ప్రయాణికుల ఆసక్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్యుపెన్సీ 70 నుంచి 80శాతం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. జిల్లాకు ఒక స్టేషన్‌లో రైలు ఆగడానికి అనుమతి ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రైళ్లలో ప్రయాణించాలని స్పష్టం చేసింది.
అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు స్టేషన్లలో రైలు ఆగుతుంది. మరోవైపు షెడ్యూల్ రైళ్లకు ఇంకా అనుమతి లభించలేదు. ఇక ఈ 24 రైళ్ళు, ప్రత్యేక రైళ్లుగానే ముందస్తు రిజర్వేషన్లతో నడుస్తాయి. ఎక్కేందుకు గంట ముందుగానే స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలు చేసిన తరువాతనే రైలులోకి అనుమతిస్తారు. బోగీలు శానిటైజేషన్ తరువాతనే ప్రయాణీకుల్ని అనుమతిస్థారు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాల్సి ఉంటుంది. ఈ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– చాప్రా (02669)
ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ(02615)
హౌరా–సికింద్రాబాద్ (02703)
విశాఖపట్నం–న్యూఢిల్లీ (02805)
హౌరా–యశ్వంత్‌పూర్ (02245)
భువనేశ్వర్–ముంబై(01020)
తిరుచ్చిరాపల్లి –హౌరా (02664)
దానాపూర్– కెఎస్‌ఆర్ బెంగళూరు (02296)
చాప్రా–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02670)
గుంటూరు– సికింద్రాబాద్ (07201)
హౌరా–తిరుచ్చిరాపల్లి (02663)
ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ (02433)
బెంగళూరు కంటోన్మెంట్ – గౌహతి (02509)
ముంబై–భువనేశ్వర్(01019)
న్యూఢిల్లీ–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02434)
సికింద్రాబాద్–గుంటూరు (07202)
గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్ (02510)
సికింద్రాబాద్–హౌరా (02704)
కెఎస్‌ఆర్ బెంగళూరు – దానాపూర్ (02295)
యశ్వంత్‌పూర్–హౌరా (02246)
న్యూఢిల్లీ–విశాఖపట్టణం (02806)
హైదరాబాద్– విశాఖపట్టణం (02728)
న్యూఢిల్లీ –ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02616)
విశాఖపట్నం– హైదరాబాద్ (02727)