Good News For Andhra Pradesh Employees: ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. వారికి వారానికి ఐదు రోజులే పని దినాలు ..

Good News For Andhra Pradesh Employees: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2020-06-27 01:55 GMT

 Good news for Andhra Pradesh Employees: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను నిర్ణయించారు. అయితే ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా.. దీన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఉద్యోగులకు పని దినాలను వచ్చే ఏడాది వరకు ఐదు రోజుల వరకే పొడిగిస్తూ..ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని సచివాలయ ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీనిపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 'ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారని, ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నందుకు సీఎం జగన్‌కు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు ఉత్సాహకతతో పనిచేసేలా ఈ ఉత్తర్వులు దోహదం పడతాయని సంతోషం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News