శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

*ఉత్సవాల్లో ఆరో రోజు కాళరాత్రి రూపంలో అమ్మవారు

Update: 2022-10-03 01:38 GMT

శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దివ్యక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భ్రమరాంభిక అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ఉత్సవాల్లో ఏడో రోజు కాళరాత్రి దేవిగా నల్లటి దేహఛాయతో జుట్టు విరబోసుకున్నట్లుగా రౌద్రరూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలతో కుడివైపున అభయహస్తం వరద ముద్ర, ఎడమచేతిలో ఖడ్గం, లోహ కంటకాన్ని ధరించి దుష్టులను శిక్షించేందుకు సన్నద్ధమైనట్లుగా అమ్మవారు కాళరాత్రి రూపంలో కొలువై పూజలు అందుకున్నా్రు. ఆదిదంపతులు మల్లన్న, భ్రమరాంబిక అమ్మవారు గజవాహనంపై విహరిస్తూ భక్తుల పూజలు అందుకున్నారు. 

Tags:    

Similar News