Godavari Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

*ప.గో.జిల్లా పొన్నపల్లి దగ్గర ప్రమాదకరస్థాయిలో ప్రవాహం

Update: 2022-07-18 06:54 GMT

Godavari Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

Godavari Floods: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని పొన్నపల్లి దగ్గర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఏ క్షణానైనా గోదావరి గట్టుకు గండిపండే అవకాశం ఉండటంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. గండి పడకుండా అధికారులు ముందస్తుగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయింది. వరద ఉధృతికి ఇసుక బస్తాలు గోదావరిలో కొట్టుకుపోయాయి.

ఎగువ నుంచి వరద పెరగడంతో నరసాపురం సమీపంలో గోదావరిలో నీటిమట్టం పెరిగింది. పొన్నపల్లి దగ్గర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహ ఉదృతికి పుట్ పాత్ రెయిలింగ్ కోతకు గురయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గండి పడకుండా ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. అయితే, గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో గట్టుకు సపోర్టుగా వేసిన ఇసుక బస్తాలు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

గోదావరి గట్టుకు గండి పడితే, నరసాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు వరద నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఫుట్ పాత్ రైలింగ్ రక్షణ కోసం అధికారులు చర్యలు చేపట్టిన వరద ఉధృతికి ఇబ్బందులు తప్పడం లేదు. ముందస్తుగా గోదావరి గట్టు పక్కన నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొన్నపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కున గడుపుతున్నారు. 

Tags:    

Similar News