విశాఖలో రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
* నేడు పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం
Global Investors Summit: విశాఖలో రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. నేటితో ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగియనుంది. పెట్టుబడుల సదస్సుకు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ప్రధానంగా సమ్మిట్‌లో 14 కీలక రంగాలపై దృష్టి సారించనున్నారు. 2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల పెట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక నిన్నటి సదస్సులో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజు.. మరో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడుల MOUలు చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం. పలు రంగాలకు సంబంధించి నేడు 248కి పైగా MOUలు కుదిరే అవకాశం ఉంది. తొలి రోజు 11 లక్షల 87వేల కోట్ల విలువ చేసే 97 MOUలు చేసుకుంది ఏపీ సర్కార్. ఇక ఇవాళ్టి సదస్సులో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాలా, రాజీవ్ చంద్ర శేఖరన్ పాల్గొననున్నారు. కాసేపట్లో టూరిజం శాఖలో పలు MOUలతో ఇవాళ్టి సదస్సు ప్రారంభంకానుంది.
రెండో సెషన్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు రెడ్డీస్ లాబోరేటరీ ఛైర్మన్ సతీష్ రెడ్డి, నోవా ఎయిర్ CEO గజానన నాబర్, భారత్ బయోటెక్ ఛైర్ పర్సన్ సుచిత్ర ఎల్లా తదితరులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం సీఎం జగన్ ముగింపు ప్రసంగం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.