Gas Leakage in Chittoor: ఏపీలో మరో గ్యాస్ లీకేజ్
Gas Leakage in Chittoor: ఆంధ్ర ప్రదేశ్ ను వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. గత కొద్దీ రోజుల కింద జరిగిన విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మరిచిపోక ముందే.. తాజాగా అలాంటి ఘటననే మరొటి జరిగింది
Gas Leakage in Chittoor: ఆంధ్రప్రదేశ్ ను వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. గత కొద్దీ రోజుల కింద జరిగిన విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మరిచిపోక ముందే.. తాజాగా అలాంటి ఘటననే మరొటి జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని బందపల్లి హాట్సన్ డైరీ లో అమోనియా గ్యాస్ లీకేజీ జరిగింది. తాజా సమాచారం ప్రకారం గ్యాస్ ప్రభావంతో 12 మందికి పైగా స్పృహ కోల్పోయారని సమాచారం. గ్యాస్ ప్రభావానికి గురి అయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది కోలుకున్నారు.
ఘటన స్థలిని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భారత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ పరిశీలించారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు తెలుసుకుంటున్నామని అన్నారు. అయితే పరిస్థితిని తక్షణమే అదుపులోకి తెచ్చామని అనారోగ్యానికి గురైన వారందరినీ చిత్తూరు ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నామని తెలిపారు
అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురి పరిసిత్థి విషమంగా ఉందని , కాని వారికి ఇతర ఆరోగ్య సమస్యలు లేనందున పెద్దగా ప్రమాదం ఏమీ లేదని కలెక్టర్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వారిని తిరుపతి దవాఖానకు తరలించమని తెలిపారు. ప్రమాదంపై పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, అగ్నిమాపక శాఖలకు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు.